అమితాబ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది
close
Published : 14/07/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమితాబ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది

వెల్లడించిన ఆస్పత్రి వర్గాలు

ముంబయి: కరోనా పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నావావతి ఆస్పత్రి వర్గాలు ఆదివారం ఉదయం ప్రకటించాయి. లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ విభాగంలో ఉన్నట్లు తెలిపారు.  ఆయన తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ కూడా కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. 

యాంటిజెన్‌లో ఐశ్యర్య, జయా బచ్చన్‌కు నెగిటివ్‌..

ఒకే కుటుంబంలో ఇద్దరికి కరోనా సోకడంతో వారి సిబ్బంది, కుటుంబ సభ్యులు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారందరి ఫలితాలు ఈరోజు రానున్నట్లు సమాచారం. ప్రముఖ నటి, అమితాబ్‌ సతీమణి జయాబచ్చన్‌కు ప్రాథమికంగా నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు సమాచారం. అలాగే.. అభిషేక్‌ సతీమణి ఐశ్వర్య రాయ్‌కి కూడా నెగిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, పూర్తి స్థాయి నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష ఫలితాలు మాత్రం ఇంకా రావాల్సి ఉంది. 

తనకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిందని స్వయంగా అమితాబ్‌ బచ్చనే శనివారం రాత్రి ట్వీట్‌ చేసిన విషయం తెలిసింది. అర్ధరాత్రి సమయంలో అభిషేక్‌ బచ్చన్‌ తనకు కూడా కరోనా సోకినట్లు వెల్లడించారు. ‘నాకు కొవిడ్‌-19 పాజిటివ్‌ అని బయటపడింది. దీంతో ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు, నా సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకున్నారు. వారి ఫలితాలు రావాల్సి ఉంది. గత 10 రోజులుగా నా దగ్గరకు వచ్చినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ బిగ్‌బీ ట్వీట్‌ చేశారు.

అమితాబ్‌, అభిషేక్‌ త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ట్వీట్లు చేశారు...

‘అమిత్‌ జీ.. మీరు త్వరగా కోలుకోవాలని యావత్తు దేశం ప్రార్థిస్తోంది. అందులో నేనూ చేరుతున్నాను. మీరు ఎంతో మందికి ఆదర్శం. ఐకానిక్‌ సూపర్‌స్టార్‌. మీరు క్షేమంగా ఉండాలని మేం ఎప్పుడూ కోరుకుంటాం. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’

- హర్షవర్ధన్‌, కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి

‘మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. లక్షల మంది ప్రార్థనల ఆశీర్వాద బలం మీతో ఉంది’

- అరవింద్‌ కేజ్రీవాల్‌, దిల్లీ ముఖ్యమంత్రి

‘అమితాబ్‌ జీకి కరోనా సోకిందన్న వార్త విచారానికి గురిచేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’

- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి

‘అమిత్‌ జీ.. మా ప్రార్థనలు ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటాయి. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం’

- మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు

‘సోదరా జూనియన్‌ బచ్చన్‌(అభిషేక్‌ బచ్చన్‌) త్వరగా కోలుకో. కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా’

- రితేష్‌ దేశ్‌ముఖ్‌, బాలీవుడ్‌ కథానాయకుడు

‘అమిత్‌ జీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’

- బోనీ కపూర్‌, ప్రముఖ నిర్మాత

‘మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా సర్‌’

- ధనుష్‌, కోలీవుడ్‌ కథానాయకుడు

‘టేక్‌ కేర్‌ అమిత్‌ జీ.. మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా’

- సచిన్‌ తెందూల్కర్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని