అమెజాన్‌లో ఆనంద్‌ దేవరకొండ చిత్రం - Anand Devarakonda middle class melodies on Amazon prime
close
Published : 08/11/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెజాన్‌లో ఆనంద్‌ దేవరకొండ చిత్రం

హైదరాబాద్‌: ‘దొరసాని’ చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆనంద్‌ దేవరకొండ. ఆయన కీలక పాత్రలో వినోద్‌ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’. వర్ష బొల్లమ్మ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

‘గుంటూరులో హోటలంటే మాటలు కాదు.. నీలాంటోడు సందుకొకడు ఉన్నాడు’ అంటూ కొడుకును మందలిస్తున్న తండ్రి సంభాషణలో సాగిన మోషన్‌ పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి కథానాయకుడు గుంటూరు వెళ్లి హోటల్‌ పెట్టాడా? అప్పుడు అతనికి ఎదురైన అనుభవాలు ఏంటి? సంధ్య(వర్ష)తో పరిచయం ఎలా ఏర్పడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నవంబరు 20న అమెజాన్‌ వేదికగా ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. స్వీకర్‌ అగస్త, ఆర్‌హెచ్‌ విక్రమ్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని