ఏ దుస్తులు వేసుకున్నా ట్రోల్‌ చేస్తారు: అనన్య - Ananya Panday on trolls criticising her clothes
close
Updated : 06/12/2020 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏ దుస్తులు వేసుకున్నా ట్రోల్‌ చేస్తారు: అనన్య

ముంబయి: తాను ఏ దుస్తులు ధరించినా సరే నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తూనే ఉంటారని బాలీవుడ్‌ యువ తార అనన్యపాండే అన్నారు. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్ 2‌’తో హీరోయిన్‌గా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటి.. తన క్యూట్‌ లుక్స్‌తో ఇప్పుడిప్పుడే ఫాలోయింగ్‌ పెంచుకుంటున్నారు. బీటౌన్‌ బేబో కరీనాకపూర్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ చాట్‌ షో.. ‘వాట్‌ ఉమెన్‌ వాంట్‌’లో తాజాగా అనన్యపాండే పాల్గొని తన లైఫ్‌, కెరీర్‌, నెగెటివ్‌ ట్రోలింగ్‌ గురించి మాట్లాడారు.

‘లైమ్‌లైట్‌లోకి వచ్చాక అందరిచూపు సెలబ్రిటీలపైనే ఉంటుంది. సెలబ్రిటీలు ఏం చేసినా సరే ట్రోలింగ్‌ చేస్తారు. ఎలాంటి దుస్తులు ధరించినా నెగెటివ్‌ కామెంట్లు చేస్తారు. అలాంటి నెగెటివిటీని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు’ అని అనన్యను ప్రశ్నించగా.. ‘కెరీర్‌ ప్రారంభించిన సమయంలో అందరికీ నచ్చేలా దుస్తులు ధరించేదాన్ని. ఆ తర్వాత నాకు నచ్చే విధంగా దుస్తులు వేసుకుంటున్నాను. నా ఇష్టాలు, అభిరుచులు, సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. ట్రోలింగ్‌ విషయానికి వస్తే.. నేను ఏం చేసినా, ఎలాంటి దుస్తులు వేసుకున్నా కొంతమంది తప్పుకుండా నన్ను ట్రోల్‌ చేస్తూనే ఉంటారు. కాబట్టి, వాటి గురించి పట్టించుకోను. నా సౌకర్యం, సంతోషానికి మొదటిస్థానమిస్తాను. అలాగే, నా ఫొటోలు బాగా వచ్చాయా? వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశానా?ఇదే నేను చూస్తా’ అని అనన్య వివరించారు.

‘ఫైటర్‌’తో అనన్యపాండే తెలుగుతెరకు కథానాయికగా ఎంట్రీ ఇవ్వనున్నారు. పూరీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన అనన్య సందడి చేయనున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని