ఏపీలో ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్‌ - Andrapradesh police seva app starts in AP
close
Updated : 21/09/2020 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్‌

ఆవిష్కరించిన సీఎం జగన్‌

అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ సేవ’ యాప్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. దేశంలోనే తొలిసారిగా సరికొత్తగా రూపొందించిన ఈ యాప్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ యాప్‌కు రూపకల్పన చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండానే ప్రజలకు 87 రకాల సేవలు దీని ద్వారా అందనున్నాయి. పోలీస్‌స్టేషన్‌ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందే అవకాశం కల్పించారు. అన్ని నేరాలపై ఫిర్యాదులు చేయడమే కాకుండా వాటికి రసీదు సైతం లభించేలా యాప్‌ను తీర్చిదిద్దారు. యాప్‌ పని చేసే విధానాన్ని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. సిటిజన్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా యాప్‌ను తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించిన 12 మాడ్యూల్స్‌ను ఇందులో చేర్చామన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని