చైనా, రష్యా టీకాలు వద్దు బాబోయ్‌..! - Anthony Fauci Says It Is Unlikely To Use China Russia covid Vaccines
close
Published : 02/08/2020 00:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా, రష్యా టీకాలు వద్దు బాబోయ్‌..!

పరీక్షించకుండానే విక్రయాల అనుమతులపై విస్మయం

కొనుగోలు చేయొద్దన్న ఆంటోనీ ఫౌచి

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: చైనా, రష్యా రూపొందిస్తున్న కొవిడ్‌-19 టీకాలను కొనుగోలు చేసేందుకు అమెరికా సుముఖంగా లేదని సమాచారం. విస్తృతంగా క్లినికల్‌ ట్రయల్స్‌ జరపకుండానే ముందుగానే మార్కెట్లో విడుదల చేసే ఈ వ్యాక్సిన్లతో ప్రమాదమని భావిస్తోంది. అవి సురక్షితమో కాదో తెలియదని ఆందోళన చెందుతోంది.

కరోనా వైరస్‌ ప్రభావం దశాబ్దాల వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొవిడ్‌-19 ప్రపంచ మహమ్మారిగా ప్రకటించి ఆరు నెలలు కావడంతో ఆ సంస్థ అధినేత డాక్టర్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ గెబ్రియేసస్‌ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాల స్థాయిలో పారదర్శకంగా లేని ఔషధ నియంత్రణ సంస్థలున్న దేశాల టీకాలను తాము వాడటం కష్టమేనని అమెరికా అంటు వ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోని ఫౌచి అన్నారు.

‘ఇతరులకు విక్రయించేందుకు అనుమతులు పొందేముందు వ్యాక్సిన్‌ను చైనా, రష్యా విస్తృతంగా పరీక్షిస్తాయనే అనుకుంటున్నా. పరీక్షించకుండానే టీకాలను సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. అలా చేస్తే సమస్య కచ్చితంగా మరింత జటిలం అవుతుంది’ అని ఫౌచి మీడియా సమావేశంలో అన్నారు. కాగా సొంతంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఫార్మా దిగ్గజాలు సనోఫి, గ్లాక్సోస్మిత్‌కెలైన్‌ (జీఎస్‌కే)కు 2.1బిలియన్‌ డాలర్లు చెల్లించిన సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని