సుశాంత్‌తో పరిణీతి నటించనని చెప్పింది! - Anurag Kashyap questions how someone could force Kangana Ranaut to take drugs
close
Published : 21/09/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌తో పరిణీతి నటించనని చెప్పింది!

ముంబయి: నటి కంగనా రనౌత్‌పై దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ మరోసారి మాటల దాడికి దిగారు. ఒకానొక సమయంలో ఆమె మానసిక కుంగుబాటుకు గురయ్యిందని.. దాని నుంచి కోలుకునేందుకు చెడు వ్యసనాలకు అలవాటు పడిందన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన.. బాలీవుడ్‌లో చాలామంది నటీనటులు డ్రగ్స్‌కు బానిసయ్యారని, అంతేకాకుండా ఓ నటుడు తనకి బలవంతంగా మత్తు పదార్థాలను అలవాటు చేశాడని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా అనురాగ్‌ కశ్యప్‌ సదరు నటి వ్యాఖ్యలపై స్పందించారు. అంతేకాకుండా తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలను ఓ ఛానెల్‌తో పంచుకున్నారు.

‘జీవితంలో మానసిక కుంగుబాటుకు లోనైన కారణంగా నాకు తెలిసిన కొద్దిమంది మాదకద్రవ్యాలకు బానిసలయ్యారు. తను నటించిన సినిమాలు విజయాన్ని సాధించకపోవడం, ప్రేక్షకులు కూడా తనని సరిగ్గా అభిమానించకపోవడంతో కంగన కూడా ఒకానొక సమయంలో నిరాశకు గురయ్యారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు. ‘క్వీన్‌’ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు.. నిరాశ నుంచి బయటకు రావడం కోసం కంగన సెట్‌లోనే మద్యం సేవించేవారు. అది నేను కళ్లారా చూశాను. ఆమె చెప్పినట్లు ఎవరో బలవంతం చేసి మద్యం తాగించలేదు. అంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ సినిమా తర్వాత నేను ఆమెతో టచ్‌లో లేను. నాకు తెలిసి ఆతర్వాతే ఆమె మారినట్లు ఉంది.’ అని అనురాగ్‌ తెలిపారు.

‘టీవీ నటుడితో పనిచేయను’
సిద్ధార్థ్‌ మల్హోత్ర కథానాయకుడిగా తెరకెక్కిన ‘హసీ తో ఫసీ’ చిత్రం సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమా కథ పూర్తి అయ్యాక కథానాయికగా పరిణీతి చోప్రాను అనుకున్నాం. ఆమెను సంప్రదించగా.. ‘టీవీ నటుడితో నేను కలిసి పనిచేయను’ అని చెప్పేసింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేవలం బుల్లితెర నటుడు మాత్రమే కాదని పీకే సినిమాతో పాటు మరో సినిమాలో కూడా నటిస్తున్నాడని చెప్పాం. అదే సమయంలో ఆమె ‘శుద్ధ్ దేశీ రోమాన్స్’ చిత్రానికి సంతకం చేసింది. దీంతో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్ వాళ్లు సుశాంత్‌ని పిలిచి మాట్లాడారు.‘‘హసీ తో ఫసీ’ చిత్రానికి బదులు ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’ చిత్రంలో అవకాశం ఇచ్చారు.’ అని అనురాగ్‌ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని