అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్‌ వచ్చేసింది! - Anushka Shetty Nishabdham Trailer out now
close
Updated : 21/09/2020 13:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: అనుష్క, మాధవన్‌, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో అమెజాన్‌ వేదికగా అక్టోబరు 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా యువ నటుడు రానా ఈ సినిమా ట్రైలర్‌ను అభిమానులతో పంచుకున్నారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

అనుష్క ఇందులో దివ్యాంగురాలిగా కనిపించనున్నారు. సోనాలి అనే యువత కనిపించకుండా పోవటానికి కారణం ఏంటి? సాక్షి(అనుష్క), ఆంటోని(మాధవన్‌)లు ఎవరు? వారికి సోనాలికీ సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మైఖేల్‌ మాడిసన్‌, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ సంగీతం అందించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని