‘సర్కారువారి పాట’లో అనుష్క.. నిజమెంత? - Anushka Shetty in Mahesh Babu Sarkaru Vaari Paata
close
Published : 22/11/2020 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సర్కారువారి పాట’లో అనుష్క.. నిజమెంత?

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ సినిమాకు పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలు కూడా చేసుకుంది. ఇందులో మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి టాలీవుడ్‌లో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్‌ బ్యాంకు మేనేజర్‌గా అనుష్కశెట్టి కనిపించనుందన్నది దాని సారాంశం. అయితే.. దీనికి సంబంధించి చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. చివరికి తేలిందేంటంటే.. ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదట. 

ఎవరో ఓ అజ్ఞాత వ్యక్తి ట్విటర్‌లో డైరెక్టర్‌ పరుశురామ్‌ పేరుతో ఖాతా తెరిచారు. ‘‘సర్కారువారి పాట’లో అనుష్క ఓ పాత్ర పోషిస్తుండటం సంతోషంగా ఉంది. ఆమె ఈ సినిమాలో అదరగొడుతుందన్న నమ్మకం ఉంది. షూటింగ్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’’ అని అందులో పోస్టు చేశాడు. తీరా అది నకిలీ ఖాతా అని తెలిసే సరికి ఈ వార్త కూడా నకిలీదేనని స్పష్టమైంది. ఇదిలా ఉండగా.. 2021 జనవరి మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని