‘అర్ధశతాబ్దం’ విడుదల వాయిదా - Ardha Shathabdham Teaser out
close
Updated : 23/03/2021 19:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అర్ధశతాబ్దం’ విడుదల వాయిదా

ఇంటర్నెట్‌ డెస్‌: కార్తీక్ రత్నం‌, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అర్ధ శతాబ్దం’. ‘‘న్యాయం ధర్మం అవుతుంది కానీ... ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదంటున్నాడు ఓ వ్యక్తి. యుద్ధమే ధర్మం కానప్పుడు... ధర్మయుద్ధాలు  ఎక్కడివి. ఈ స్వతంత్ర దేశంలో గణతంత్రం ఎవడికో? ఎందుకో? దేనికో..? ఈ విశాల భారతానికి అఖండ రాజ్యం’’ అని ప్రశ్నిస్తున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే ఏప్రిల్‌ 2వ తేదీ  వరకు ఆగాల్సిందే.

‘ఆహా’ ఓటీటీ వేదికగా ‘అర్ధశతాబ్దం’ విడుదల కానుంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీర్‌ ధర్మిక్‌ సమర్పణలో రిషిత శ్రీ, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్‌ పతాకంపై చిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణలు నిర్మిస్తున్నారు. నాఫాల్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో శుభలేఖ సుధాకర్‌, రాజా రవీంద్ర, సుహాస్‌ తదితరులు నటిస్తున్నారు. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం మార్చి 26న విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా విడుదల తేదీని ఏప్రిల్‌ 2కు వాయిదా వేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని