ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ మధ్య భీకర పోరు  - Armenian Azeri Forces Battle Again
close
Published : 29/09/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ మధ్య భీకర పోరు 

21 మందికి పైగా మృత్యువాత..

యెరవాన్‌ : ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ దేశాల వివాదాస్పద ప్రాంతమైన నాగోర్నో- కరాబాఖ్‌ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడానికి రెండో రోజూ ఘర్షణ కొనసాగింది. ఈ రెండు దేశాల మధ్య ఆదివారం జరిగిన పోరులో 16 మంది చనిపోగా సోమవారం 21 మందికి పైగా మృతి చెందారు. తమ దేశానికి చెందిన ఆరుగురు పౌరులు మృత్యువాత పడినట్లు... 19 మంది గాయాలపాలైనట్లు అజర్‌బైజాన్‌ తెలిపింది. ఈ క్రమంలో 15 మందికి పైగా తమ సైనికులు చనిపోయినట్లు నాగోర్నో- కరాబాఖ్‌ మద్దతు కలిగిన ఆర్మేనియా బలగాలు ప్రకటించాయి. దీంతో పాటు ఆదివారం జరిగిన ఘర్షణలో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. నాగోర్నో-కరాబాఖ్‌ ప్రాంతానికి ఉత్తర భాగాన ఉన్న అజర్‌బైజాలోని అజేరీ పట్టణాన్ని ఆర్మేనియా బలగాలు చుట్టుముట్టినట్లు అజర్‌బైజాన్‌ రక్షణ శాఖ తెలిపింది.

 ఈ నేపథ్యంలో కారాబాఖ్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలను తమ సైనికులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. ఈ దేశాల మధ్య 2016 లోనూ ఘర్షణలు జరిగాయి. ఆ సమయంలో దాదాపు 100 మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది జులై నెలలో జరిగిన పోరులోనూ 16 మంది మరణించారు. నాగోర్నో- కరాబాఖ్‌ ప్రాంతం భౌగోళికపరంగా అజర్‌బైజాన్‌ దేశంలో ఉంది. అయినా అజర్‌బైజాన్‌ విధానాలను వ్యతిరేకించే ఆర్మేనియా బలగాలే ఎప్పటి నుంచో దానిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. 


 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని