అధిక బిల్లు రావడంపై సరదాగా వ్యాఖ్యానించిన బాలీవుడ్ నటుడు
ముంబయి: భారీగా విద్యుత్తు బిల్లు రావడంపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి ట్విటర్ వేదికగా స్పందించాడు. తన ఇంటికి 1,03,564 విద్యుత్తు బిల్లు వచ్చిందని.. జులై 4న ఆ డబ్బులు తన ఖాతాలోనుంచి డెబిట్ అయినట్లు తెలిపాడు. ‘ప్రజలారా.. దయచేసి నేను రూపొందించిన పెయింటింగులను కొనండి. ఆ డబ్బుతో విద్యుత్తు బిల్లు చెల్లించాలి. తర్వాతి రాబోయే బిల్లు కోసం నా రెండు కిడ్నీలను అమ్మేందుకు సిద్ధమవుతున్నా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. అనంతరం మరో ట్వీట్లో సమస్య పరిష్కారమైందని, విద్యుత్తు సంస్థ వెంటనే స్పందించినట్లు వెల్లడించాడు. ‘ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన అదానీ విద్యుత్తు సంస్థకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు.
బాలీవుడ్ నటీనటులకు అధిక విద్యుత్యు బిల్లు రావడం ఇదే మొదటిసారి కాదు. తాప్సీ, రేణుక శహానే, హ్యూమా ఖురేషి, నిమ్రత్ కౌర్, సోహా అలీఖాన్, అమ్ర్యా దస్తుర్, డినో మోరియా, కామ్య పంజాబ్‌తోపాటు పలువురు నటీనటులు జూన్‌కు సంబంధించి అధిక బిల్లు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటులతోపాటు ముంబయి నగర వాసులు సైతం ఊహించని కరెంటు బిల్లుపై ఫిర్యాదులు చేశారు.
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘పక్కా’గా నడుస్తున్న షూటింగ్!
-
‘మహా సముద్రం’లో శర్వానంద్ ఇలా..!
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
శాకుంతల.. దుష్యంతుడు
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
గుసగుసలు
-
బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకురాలిగా పూర్ణ?
-
పారితోషికం వల్ల భారీ ప్రాజెక్ట్‌కు ఈషా నో
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
కొత్త పాట గురూ
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!