తాప్సీ కష్టానికి కాజల్‌ ఫిదా - As I finish the last athletic training today for RashmiRocket here is the journey
close
Published : 16/12/2020 20:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాప్సీ కష్టానికి కాజల్‌ ఫిదా

స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన సొట్టబుగ్గల సుందరి

ముంబయి: పాత్ర కోసం ఎంతటి కష్టాన్నైనా భరించడానికి ముందుంటారు నటీనటులు. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా హీరోయిన్లు సైతం తాము పోషించే పాత్రలు డిమాండ్‌ చేస్తే జిమ్‌లో చెమటలు చిందించడానికి వెనుకాడడం లేదు. తాజాగా నటి తాప్సీ ‘రష్మి రాకెట్‌’ కోసం అదే విధంగా శ్రమించారు. ఆమె కష్టాన్ని చూసి కాజల్‌ ఫిదా అయ్యారు.

మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ ప్రస్తుతం ‘రష్మీ రాకెట్’ కోసం పనిచేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీగా ఆమె కనిపించనున్నారు. పూర్తిస్థాయి అథ్లెట్‌గా కనిపించేందుకు న్యూట్రీషియనిస్టు, ఫిజియోథెరఫిస్టు, ట్రాక్‌ ట్రైనర్‌, అథ్లెటిక్‌ కోచ్‌.. సహకారాన్ని తీసుకున్నారు. గ్రౌండ్‌లో చెమటోడుస్తున్న పలు ఫొటోలను ఇప్పటివరకూ షేర్‌ చేసిన ఆమె తాజాగా తన ట్రైనింగ్‌కు సంబంధించి ఓ స్పెషల్‌ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

‘ఇది భరించలేని నొప్పితో కూడుకున్న శిక్షణ. షూటింగ్‌ ప్రారంభమైన మూడోరోజే.. నా శరీరం దీనిని భరించలేదని అనిపించింది. పరుగెత్తలేకపోయాను. కేవలం నడవడం కోసం.. షూటింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాలనుకున్నా. ఈ సినిమా కోసం జిమ్‌లో ఎంతో శ్రమించా. తీవ్రంగా కష్టపడ్డా. నా జర్నీకి సంబంధించి ఇది కేవలం చిన్న గ్లిమ్స్‌ మాత్రమే’ అని ఆమె అన్నారు. తాప్సీ షేర్‌ చేసిన వీడియో చూసి పలువురు నటీమణులు ఫిదా అయ్యారు. ‘అద్భుతం’ అని కాజల్‌ ప్రశంసించగా.. విద్యాబాలన్‌, సోనాక్షి సిన్హా, పూజా రామచంద్రన్‌, భూమి ఫడ్నేకర్‌.. ‘సూపర్‌’ అంటూ కామెంట్లు పెట్టారు.

ఇవీ చదవండి

‘జెర్సీ’ యూనిట్‌కు ధన్యవాదాలు: షాహీద్‌

హృతిక్‌ ఇకనైనా ఏడుపు ఆపుతావా?: కంగన
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని