ఆస్పత్రిలో డాక్టర్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌ - Assam based doctor dancing to make COVID patients happy video goes viral
close
Updated : 20/10/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్పత్రిలో డాక్టర్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

హృతిక్‌ ఫిదా

ముంబయి: ప్రాణ భయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో ఉత్సాహం నింపేందుకు అసోంకు చెందిన ఓ వైద్యుడు డ్యాన్సర్‌గా మారారు. హృతిక్‌ రోషన్‌ చిందేసిన ‘వార్‌’లోని ‘గుంగ్రూ..’ గీతానికి అద్భుతంగా స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను వైద్యుడు సయ్యద్‌ ఫైజాన్‌ అహ్మద్‌ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘అసోంలోని సిల్చార్‌ మెడికల్‌ కళాశాలలో నా కొవిడ్‌ డ్యూటీ సహ వైద్యుడు అరుప్‌ సేనాపతిని చూడండి. కరోనా రోగుల్ని సంతోష పెట్టడానికి వారి ముందు ఇలా డ్యాన్స్‌ చేశాడు’ అని పేర్కొన్నారు. దీన్ని చూసిన హృతిక్‌ స్పందించారు. ‘నేను ఆయన దగ్గర స్టెప్పులు నేర్చుకుని, ఆ డ్యాన్స్‌ చేయాలనుకుంటున్నానని డాక్టర్‌ అరుప్‌కు చెప్పండి. ఆయన ఆత్మస్థైర్యం అద్భుతం’ అని పేర్కొన్నారు. వైద్యుడి డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆయన మంచి మనసుకు, డ్యాన్స్‌కు హృతిక్‌తోపాటు నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు.

హృతిక్‌ ఇటీవల ‘వార్‌’ సినిమాతో హిట్‌ అందుకున్నారు. ఆయనతోపాటు టైగర్‌ ష్రాఫ్‌, వాణీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకోవడంతోపాటు బాక్సాఫీసు వద్ద రూ.475 కోట్లకుపైగా రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీని తర్వాత హృతిక్‌ ‘సత్తే పే సత్తా’ రీమేక్‌లో నటించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని