కరోనా యాంటీబాడీలు అధికంగా తగ్గేది వారిలోనే.. - Asymptomatic coronavirus patients Lose Antibodies rapidly
close
Published : 27/10/2020 15:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా యాంటీబాడీలు అధికంగా తగ్గేది వారిలోనే..

లండన్‌: లక్షణాలు లేని కరోనా వైరస్‌ బాధితులు, ఉన్నవారితో పోలిస్తే యాంటీబాడీలను త్వరగా కోల్పోతారని పరిశోధకులు అంటున్నారు. ఈ మేరకు బ్రిటన్‌లో నిర్వహించిన ఓ సర్వే ఫలితాలను నేడు ప్రచురించారు. లండన్‌కు చెందిన ఇంపీరియల్‌ కాలేజ్‌, పరిశోధనా సంస్థ ఇప్సోస్‌ మోరీల సంయుక్త సర్వేలో యాంటీబాడీలకు సంబంధించి పలు ఆసక్తికల ఫలితాలు వెల్లడయ్యాయి. యాంటీబాడీలను గురించి అవగాహన కల్పిస్తున్న ఈ పరిశోధన.. కొవిడ్‌ కట్టడి చర్యల్లో కీలకమైనదని శాస్త్రవేత్తలు తెలిపారు.

మూడున్నర లక్షల మందికి పైగా

బ్రిటన్‌ ప్రభుత్వ సహకారంతో జరిగిన ఈ పరిశోధనను జూన్‌ 20 నుంచి సెప్టెంబర్‌ 28 మధ్య కాలంలో మూడు లక్షల 65 వేల మంది నుంచి సేకరించిన నమూనాలతో చేపట్టారు. ఈ మూడు నెలల వ్యవధిలో యాంటీబాడీలను కలిగిన వారి సంఖ్య 26.5 శాతం మేరకు క్షీణించినట్టు తెలిసింది. జ్వరం, దగ్గు, రుచి, వాసన తెలియక పోవటం వంటి లక్షణాలు లేని కరోనా బాధితుల్లో యాంటీబాడీల తగ్గుదల రేటు మరింత ఎక్కువని వెల్లడైంది. అంతేకాకుండా వయస్సు 75 పైబడిన వారితో పోలిస్తే.. 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్కులలో యాంటీబాడీల క్షీణత స్పల్పంగా ఉన్నట్టు వెల్లడైంది. కరోనా విషయంలో వ్యక్తుల వ్యాధినిరోధక వ్యవస్థ దీటుగా స్పందించే తీరు.. కాలం గడిచిన కొద్దీ క్రమేపీ క్షీణిస్తుందని కూడాతెలిసింది.

ఆరోగ్య సిబ్బందిలో భేష్

దేశంలో యాంటీబాడీలను కలిగిన వారి సంఖ్య సమయం గడిచే కొద్దీ తగ్గుతోందని ముఖ్య పరిశోధకురాలు హెలెన్‌ వార్డ్‌ తెలిపారు. ఇక జాతీయ స్థాయిలో యాంటీబాడీలను కలిగి ఉన్నవారి సంఖ్య 6 శాతం నుంచి 4.4 శాతానికి పడిపోయింది. అయితే ఆరోగ్య సేవల సిబ్బందిలో మాత్రం యాంటీబాడీల స్థాయిలో ఏ మార్పు చోటు చేసుకోకపోవటం గమనార్హం. ఈ పరిస్థితి వల్ల ప్రజలు మళ్లీ కొవిడ్‌ బారిన పడే అవకాశముందా అని నిర్ధారణగా చెప్పలేమని.. అయితే ప్రతిఒక్కరు కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం నడచుకుంటూ తమకు, ఇతరులకు ప్రమాదాన్ని తగ్గించాలని ఆమె సూచించారు. ఇక కొవిడ్‌-19 యాంటీబాడీలు ఎంత మొత్తంలో ఉత్పత్తయ్యేదీ.. వాటి వల్ల లభించే వ్యాధి నిరోధకత ఎంతకాలం పనిచేసేదీ అనే విషయాలపై ఇంకా పరిశోధన జరగాలన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని