ఆయుష్‌ వైద్యులు కరోనా మందులు సూచించొద్దు - Ayush Doctors Cant Prescribe Advertise corona Medicines: Supreme Court
close
Published : 15/12/2020 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయుష్‌ వైద్యులు కరోనా మందులు సూచించొద్దు

సుప్రీంకోర్టు

దిల్లీ: ఆయుష్‌, హోమియోపతి వైద్యులు కరోనా చికిత్సకు మందులు సూచించడం గానీ, వాటిని ప్రచారం చేయడం గానీ చేయకూడదని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఇటువంటి ప్రిస్క్రిప్షన్లను నిషేధిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అదే సమయంలో కొవిడ్ నేపథ్యంలో‌ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఆయుష్‌ వైద్యులకు కేంద్రం ఇచ్చిన సూచనలను కోర్టు సమర్థించింది. కేరళ హైకోర్టు ఆగస్టు 21న వెలువరించిన తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై స్పందించిన ఉన్నత న్యాయస్థానం ఆ ఉత్తర్వులను సవరించడానికి నిరాకరించింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. డాక్టర్‌ ఏకేబీ సద్భావనా మిషన్‌ స్కూల్‌ ఆఫ్‌ హోమియోపతి ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.

ఆయుష్‌, హోమియోపతి వైద్యులు కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వం ఆమోదించిన మాత్రలను రోగనిరోధక శక్తి పెంపొందించుకునేందుకు మాత్రమే సూచించవచ్చని.. చికిత్సలో భాగంగా ప్రిస్క్రైబ్‌ చేయొద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించిన విషయం తెలిసిందే.

కోవిడ్‌ చికిత్సలో భాగంగా ఆయుర్వేదాన్ని ఉపయోగించేందుకు అక్టోబర్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ఒక ప్రొటోకాల్‌ను విడుదల చేశారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. వాటిలోని శాస్త్రీయతను ప్రశ్నిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆయనకు ఒక లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

జులై 6 తర్వాత కనిష్ఠానికి పాజిటివ్ కేసులుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని