మళ్లీ సెట్‌లో పని చేస్తుండటం చూడాలని ఉంది - Ayushmann Khurrana wants to go sets in october
close
Published : 20/08/2020 10:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ సెట్‌లో పని చేస్తుండటం చూడాలని ఉంది

ముంబయి: బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ఆయన సినిమాల చిత్రీకరణను అక్టోబర్‌లో మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రపరిశ్రమ కూడా షూటింగ్‌లు ప్రారంభిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు.

దీని గురించి ఆయన మాట్లాడుతూ... ‘నేను అభిషేక్‌ కపూర్‌తో కలిసి నటిస్తున్న ప్రేమ కథ చిత్రీకరణను అక్టోబర్‌లో ప్రారంభించనున్నాం. మళ్లీ సెట్‌లో పని చేస్తూ ఉండటం చూడాలని ఉంది. మనందరం మరో జీవితంలో సినిమాలు తీసినట్టు ఉంది’ అంటూ వివరించారు. అంతేకాదు లాక్‌డౌన్‌లోనూ ఆయన తన సొంతూర్లో కెమెరా ముందు బిజీ బిజీగా గడిపారు. ఆ విశేషాలూ పంచుకున్నారు.

‘నేను చండీఘర్‌లో ఉన్నప్పుడు కొన్ని షూటింగ్‌ల్లో పాల్గొన్నా. అక్కడి బృందంతో చాలా సులువుగా పని చేయగలిగా. ఈ   మహమ్మారికి అలవాటు పడటానికి, దీన్ని నియంత్రించడానికి కొంత సమయం పడుతుంది. కానీ పూర్తి రక్షణ చర్యలు తీసుకుని, నా పని మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌  తరువాత చిత్రీకరణ ప్రారంభించడానికి పరిశ్రమ సరైన చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఇందుకోసం మనందరం కలిసి పని చేయాల్సి ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని