కరోనాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కన్నుమూత - B Narayan Rao Congress MLA from Bidar in Karnataka dies due to Covid19
close
Published : 25/09/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కన్నుమూత

బెంగళూరు: కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా కర్ణాటకలో మరో రాజకీయ నాయకుడు కన్నుమూశారు. కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బి నారాయన్‌ రావ్‌ కరోనాతో గురువారం తుది శ్వాస విడిచారు. బీదర్‌ జిల్లా బసవకల్యాణ్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన నారాయణ రావ్‌ సెప్టెంబర్‌ 1న కరోనా కారణంగా తలెత్తిన  అనారోగ్యంతో బెంగళూరులోని ఆస్పత్రిలో చేరారు. అవయవాలు పాడైపోవడం కారణంగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈయన మృతి పట్ల కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి ఇదే రాష్ట్రానికి చెందిన లోక్‌సభ ఎంపీ, కేంద్రమంత్రి సురేశ్‌ అంగడి కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. దీనికి కొద్ది రోజుల ముందు కర్ణాటక రాష్ట్రానికే చెందిన రాజ్యసభ ఎంపీ అశోక్‌గస్తీ కూడా మరణించడం గమనార్హం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని