యాపిల్‌ సేవలపై నాగ్‌ ఆగ్రహం..! - BE CAREFUL When you buy Apple products from Apple store India Says Nagarjuna
close
Updated : 09/12/2020 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాపిల్‌ సేవలపై నాగ్‌ ఆగ్రహం..!

ట్వీట్‌ చేసిన అగ్రకథానాయకుడు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ యాపిల్‌ సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాపిల్‌ సేవలు.. ఏక పక్షంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ట్విటర్‌ వేదికగా నాగ్‌.. తన కోపాన్ని బయటపెట్టారు. అంతేకాకుండా యాపిల్‌ సేవల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘భారత్‌లోని యాపిల్‌ స్టోర్‌ నుంచి యాపిల్‌ ప్రొడక్ట్స్‌ కొనుగోలు చేసేటప్పుడు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. వాళ్ల సేవలు, పాలసీలు ఏక పక్షంగా ఉన్నాయి. ఇది మరీ ఘోరమైన చర్య.’ అని నాగ్‌ పేర్కొన్నారు. అయితే, తన ఆగ్రహానికి గల కారణాన్ని మాత్రం నాగ్‌ బయటపెట్టలేదు.

అహిసోర్‌ సోల్మన్‌ దర్మకత్వంలో తెరకెక్కుతున్న ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రంలో ప్రస్తుతం నాగ్‌ నటిస్తున్నారు. ఇందులో ఆయన విజయ్‌వర్మ అనే ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. దీనితోపాటు బాలీవుడ్‌లో రానున్న ‘బ్రహ్మాస్త్ర’లోనూ ఆయన నటించనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని