కంగన పిటిషన్‌కు వ్యతిరేకంగా మరో అఫిడవిట్ - BMC files another affidavit against Kangana Ranauts plea
close
Published : 19/09/2020 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కంగన పిటిషన్‌కు వ్యతిరేకంగా మరో అఫిడవిట్

దాఖలు చేసిన బీఎంసీ

ముంబయి: నటి కంగనా రనౌత్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) మరోమారు ముంబయి కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వాది (కంగనా) ‘అపవిత్రమైన చేతులతో’ కోర్టును ఆశ్రయించిందని ప్రమాణపత్రంలో ఆరోపించింది. కంగన తన కార్యాలయం కూల్చివేతను సవాలు చేస్తూ రూ.2 కోట్ల నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా గతంలో కోర్టును ఆశ్రయించింది. కాగా పిటిషన్‌కు వ్యతిరేకంగా బీఎంసీ గతంలోనే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా మరో అఫిడవిట్‌ను కోర్టు ముందుంచింది. వాస్తవాలను కప్పిపెట్టి వాది కోర్టులో తప్పుడు పిల్‌ను దాఖలు చేసినట్లు బీఎంసీ ఆరోపించింది. 

గతంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ బీఎంసీ ఇదే తరహా వాదనలు చేసింది. మంజూరు చేసిన భవన ప్రణాళికకు విరుద్ధంగా రనౌత్‌ ఆస్తిలో గణనీయమైన మార్పులు చేసినట్లు పేర్కొంది. నటి వేసిన పిటిషన్‌లోనూ భవనంలో చేపట్టిన మార్పుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని వెల్లడించింది. ఆమె చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా పేర్కొంది. 

నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించారంటూ ముంబయి పాలీ హిల్స్‌లోని కంగన కార్యాలయ కూల్చివేతను బీఎంసీ గతవారం ప్రారంభించింది. దీనిపై నటి హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేతలను ఆపాలంటూ కోర్టు స్టే విధించింది. ఈనెల 22న ఈ కేసును విచారించనుంది.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని