సరిహద్దుల్లో పాక్‌ కుట్ర భగ్నం! - BSF Foiled paks attempt to push arms and drugs
close
Published : 20/09/2020 11:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరిహద్దుల్లో పాక్‌ కుట్ర భగ్నం!

దిల్లీ: సరిహద్దుల్లో దాయాది దేశం పాకిస్థాన్‌ పన్నిన మరో కుట్రను సరిహద్దు దళం భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు గుండా భారీ ఎత్తున మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా చేయాలన్న దుండగుల కుట్రలను బలగాలు తిప్పికొట్టాయి. పాక్‌వైపు సరిహద్దుకు సమీపంలో కొంతమంది అనుమానిత వ్యక్తులు తిరుగుతుండటం గమనించిన సైనికులు హెచ్చరిక కాల్పులు జరిపారు. దీంతో ముష్కరులు అక్కడి నుంచి పాక్‌ వైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో దుండగులు చక్కర్లు కొట్టిన ప్రాంతంలో తనిఖీ చేయగా.. భారీ ఎత్తున ఆయుధాలు, రెండు తుపాకులు, మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. దుండగులకు భారత్‌వైపు కూడా సంబంధాలు ఉండే అవకాశం ఉందని సైనిక వర్గాలు అనుమానిస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని