పంజాబ్‌ నుంచి చొరబాటుకు ముష్కరుల కుట్ర - BSF guns down two terrorists along Pak border in Punjab
close
Updated : 17/12/2020 11:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంజాబ్‌ నుంచి చొరబాటుకు ముష్కరుల కుట్ర

దిల్లీ: భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాదులు పన్నిన కుట్రను సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) భగ్నం చేసింది. పంజాబ్‌ సరిహద్దుల్లో చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టింది. అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 

గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో పాకిస్థాన్‌ వైపు నుంచి ఇద్దరు ముష్కరులు దట్టమైన మంచులో పంజాబ్‌లోని అట్టారీ అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నంచారు. అయితే, వీరి కదలికలను గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది తొలుత హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ వారు వెనక్కి వెళ్లకపోవడంతో కాల్పులు జరిపి మట్టుబెట్టారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన నేపథ్యంలో సరిహద్దు వెంబడి గాలింపు ముమ్మరం చేశారు. గణతంత్ర దినోత్సవం నాడు భారత్‌లో దాడులకు ఉగ్రవాదులు కుట్రలు చేసే అవకాశమున్నందున సరిహద్దుల్లో గస్తీని పెంచారు. 

ఇటీవలే మలేసియాలో ఉగ్ర సంస్థ కుట్ర భగ్నం

భారత్‌లో దాడులకు పథకం రచిస్తున్న మరో ఉగ్రవాద సంస్థ కుట్రను రీసర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) అధికారులు ఇటీవలే భగ్నం చేశారు. మలేసియా కేంద్రంగా పనిచేస్తున్న ఓ గ్రూప్‌ భారత్‌లో దాడుల కోసం ప్రణాళికలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇందుకోసం మయన్మార్‌లోని ఓ మహిళకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. అంతేగాక, దాడుల కోసం సదరు ముఠా 2లక్షల డాలర్ల లావాదేవీలు జరిపినట్లు ‘రా’ అధికారులు గుర్తించారు. చెన్నైకి చెందిన ఓ హవాలా డీలర్‌కు ఇందులో కొంత మొత్తం అందినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌, నేపాల్‌ సరిహద్దుల నుంచి భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. 

ఇదీ చదవండి..

జమ్మూకశ్మీర్‌లో పాక్‌ సైన్యం కాల్పులుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని