‘బిగ్‌బాస్‌-4’ నాగార్జున ఇలా సిద్ధమవుతున్నారు! - Back on the floor with Lights nagarjuna at Big boss4
close
Updated : 12/08/2020 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బిగ్‌బాస్‌-4’ నాగార్జున ఇలా సిద్ధమవుతున్నారు!

హైదరాబాద్‌: లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌.. అగ్ర కథానాయకులు ఈ మాటలు విని చాలా రోజులైంది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌తో షూటింగ్‌ల ప్రస్తావనే లేకుండా పోయింది. ఇటీవలే నెమ్మదిగా సీరియళ్లు, చిన్న చిత్రాలు అతి తక్కువ మందితో షూటింగ్‌ జరుపుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో బుల్లితెర తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’కు కూడా రంగం సిద్ధమైంది. అగ్ర కథానాయకుడు నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

తాజాగా సీజన్‌-4కు సంబంధించిన ప్రచార చిత్రాల షూటింగ్‌ను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత నాగార్జున మేకప్‌ వేసుకున్నారు. సెట్స్‌లోని స్టిల్స్‌ను పంచుకున్నారు. ‘‘తిరిగి షూటింగ్‌కు వచ్చేశా. లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌.. ఏం అద్భుతం... నిజంగా అద్భుతమే’’ అని ట్వీట్‌ చేశారు. పీపీఈ కిట్లు ధరించి ఉన్న మేకప్‌ మెన్‌లు ఆయనను ప్రచార చిత్రాల షూటింగ్‌ కోసం సిద్ధం చేశారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో ఈ షూటింగ్‌ జరిగింది. ‘సోగ్గాడే చిన్నినాయన’ దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దీనికి దర్శకత్వం వహించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ చిత్రీకరించారు. త్వరలోనే ఈ యాడ్‌ను విడుదల చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు బిగ్‌బాస్‌ సీజన్‌-4లో పాల్గొనే వారి జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఇది ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ సీజన్‌లో పాల్గొనే వారికి ముందుగానే కొవిడ్‌-19 పరీక్షలు చేసి, క్వారంటైన్‌కు తరలిస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణ అయిన తర్వాతే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనుమతిస్తారు. కరోనా కారణంగా ఈసారి బిగ్‌బాస్‌ను మరింత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.  ఎవరెవరు ఈ సారి హౌస్‌లోకి వెళ్తారో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని