లైట్స్‌.. కెమెరా.. మాస్క్‌ ఆన్‌.. - Back to work Akshay Kumar shares a video from the sets of BellBottom
close
Updated : 21/08/2020 15:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లైట్స్‌.. కెమెరా.. మాస్క్‌ ఆన్‌..

ముంబయి: బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘బెల్‌ బాటమ్‌’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు రంజిత్‌.ఎమ్‌.తివారీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అక్షయ్‌ తన ట్విటర్‌ ద్వారా ఓ వీడియోను పంచుకున్నారు. దీంట్లో అక్షయ్‌ ‘‘లైట్స్‌, కెమెరా, మాస్క్‌ ఆన్‌, యాక్షన్‌’’ అంటూ క్లాప్‌ కొడుతూ కనిపించారు.

‘‘ఇకపై చిత్రీకరణలన్నీ కొత్త నిబంధనలను అనుసరించే   సాగుతాయి. ఇది చాలా కష్టమైన సమయం. కానీ, పని కొనసాగించాలి’’ అని ఆ వీడియోకు ఓ వ్యాఖ్యను జత చేశారు అక్కీ. 80ల కాలంలో జరిగిన ఓ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్‌ చిత్రమిది. వాణీ కపూర్‌ కథానాయికగా నటిస్తుండగా.. హుమా ఖురేషి ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. మోనిషా అడ్వాణి, మధు బోజ్వానీ, నిఖిల్‌ అడ్వాణి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని