కూరగాయలు అమ్ముతున్న దర్శకుడు - Balika Vadhu Director Now Selling Vegetables in Azamgarh
close
Published : 28/09/2020 21:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కూరగాయలు అమ్ముతున్న దర్శకుడు

లఖ్‌నవూ(ఉత్తరప్రదేశ్) : లాక్‌డౌన్‌ కష్టాలు ఏ రంగాన్ని విడిచిపెట్టలేదు. అందులో సినిమా, టీవీ రంగాలకు మినహాయింపు లేమీ లేవు. హిందీలో ‘బాలిక వధు’ పేరుతో రూపుదిద్దుకున్న సీరియల్‌ మంచి ఆదరణ పొందింది. ఈ సీరియల్‌ దర్శకుల్లో ఒకరైన రామ్‌ వ్రిక్షా గౌర్‌ ప్రస్తుతం బండి మీద కూరగాయలు అమ్ముతున్నారు. ఇండియాలో లాక్‌డౌన్‌ విధించక ముందు తను తీయబోయే సినిమాకు సంబంధించి  ముంబయి నుంచి తన స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌ ప్రాంతానికి ఆయన అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. 

  బాలీవుడ్‌లో ప్రముఖ సినిమా దర్శకులైన యశ్‌పాల్‌ చోప్రా, మిలింద్‌ గునాజి, రణ్‌దీప్‌ హుడా, సునీల్‌ శెట్టి, రాజ్‌పాల్‌ యాదవ్‌ల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన గౌర్‌ ఈ ఏడాది ప్రారంభంలో ఓ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగానే లాక్‌డౌన్‌ విధించటంతో అన్ని రంగాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. నిర్మాత ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయలేమని, సంవత్సరం తర్వాత తిరిగి పనులు ప్రారంభిద్దామని చెప్పటంతో గౌర్‌ తన ఊరిలోనే ఆగిపోయారు. సినిమా మొదలయ్యే వరకూ ఖాళీగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈయన తనకు పరిచయం ఉన్న కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ముంబయి వెళ్లిన తొలినాళ్లలో సీరియళ్లకు సంబంధించి లైట్‌ విభాగంలో పని చేసిన గౌర్‌ అనంతరం చాలా సీరియళ్ల ప్రొడక్షన్‌ విభాగంలో పని చేశారు. తన తండ్రి కూరగాయల వ్యాపారం చేసే వారని చెప్తున్న రామ్‌ గౌర్‌ త్వరలో ముంబయి వెళ్లి తన సినిమా పనులు ప్రారంభిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  బాలిక వధు సీరియల్‌ తెలుగులోనూ చిన్నారి పెళ్లికూతురు పేరుతో ఆదరణ పొందింది. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని