సుశాంత్‌సింగ్‌ సోదరీమణులు, వైద్యుడిపై కేసు - Bandra police registers FIR against Sushants sisters and Doctor
close
Published : 08/09/2020 22:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌సింగ్‌ సోదరీమణులు, వైద్యుడిపై కేసు

విచారించనున్న సీబీఐ

ముంబయి: సుశాంత్ సింగ్‌ మృతి కేసులో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. రోజురోజుకీ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. నటుడి సన్నిహితురాలు రియా చక్రవర్తిని రెండో రోజు విచారించిన నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)కు విస్తుపోయే విషయాలు తెలిశాయి. మానసిక అందోళనకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న సుశాంత్‌కు అతడి సోదరి ప్రియాంక సింగ్‌, దిల్లీ ఎయిమ్స్‌కు చెందిన వైద్యుడు తరుణ్‌ కుమార్‌ కలిసి మోసపూరితంగా తప్పుడు ఔషధాల ప్రిస్క్రిప్షన్‌ అందించారని ఆరోపించింది. వారిరువురితోపాటు నటుడి మరో సోదరిపైనా ఫిర్యాదు చేసింది. కాగా ఆమె ఫిర్యాదు మేరకు ప్రియాంక సింగ్‌, తరుణ్‌ కుమార్‌, మరో సోదరి మితుసింగ్‌లపై బాంద్రా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముంబయి డిప్యూటీ కమిషనర్‌ అంబిక మాట్లాడుతూ ‘రియా ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశాం. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసును సీబీఐకి బదిలీ చేశాం’ అని ఆమె స్పష్టం చేశారు. 

సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్‌ జూన్‌ 14న బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, రియా తన కుమారుడిని మానసిక వేదనకు గురిచేసిందని, అతడి బ్యాంకు ఖాతా నుంచి కోట్ల రూపాయలు బదిలీ చేసుకుందని నటుడి తండ్రి గతంలో కేసులు నమోదు చేశారు. ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. రాజ్‌పూత్‌ మృతి కేసును సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలోనే డ్రగ్స్‌ వాడకం వెలుగులోకి వచ్చింది. సుశాంత్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేశారంటూ రియా సోదరుడు షోవిక్‌తోపాటు పలువురుని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూర్‌ (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. ఇదే కేసులో రియాను సైతం ఎన్‌సీబీ ప్రశ్నిస్తోంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని