బాలయ్య సరసన ‘అఖిల్‌’ భామ - Beautiful and Talented actress sayyeshaa on board for BalayyaBoyapati movie
close
Updated : 10/11/2020 12:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలయ్య సరసన ‘అఖిల్‌’ భామ

ఇంటర్నెట్‌ డెస్క్‌: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను.. వీరిద్దరి కాంబినేషన్‌ గురించి తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.! టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌హిట్లు కొట్టిన సింహ, లెజెండ్‌ సినిమాలు వీరిద్దరి కాంబినేషనల్‌లో వచ్చినవే. వీరిద్దరూ కలిసి మరోసారి అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమయ్యారు. బాలయ్యబాబు పుట్టినరోజు సందర్భంగా.. చిత్ర టీజర్‌ను కూడా ఇప్పటికే విడుదల చేశారు. అందులో బాలయ్యబాబు ఒక పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించి అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనేది ఇంతకాలం చిత్రబృందం ప్రకటించలేదు. కాగా.. ముంబయి ముద్దుగుమ్మ సయేషాసైగల్‌ను హీరోయిన్‌గా ఖరారు చేశారట. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఓ ట్వీట్‌ చేసింది. హీరోయిన్‌ సయేషా కూడా.. ‘ఈ చిత్రంలో పనిచేసే అవకాశం రావడం గర్వంగా ఉంది’ అని ట్విటర్‌లో పేర్కొంది. సయేషా తెలుగు, తమిళంతో పాటు హిందీలో మొత్తం కలిపి డజనుకుపైగా సినిమాల్లో నటించింది. ‘అఖిల్‌’ సినిమాలో అక్కినేని అఖిల్‌ సరసన కనిపిచింది కూడా ఈమెనే. 

బాలయ్యబాబు కథానాయకుడిగా వస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం ‘బీబీ3’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ పనులు సాగుతున్నాయి. ఇప్పటికల్లా షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం కావాల్సిన ఈ సినిమా చిత్రీకరణ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడింది. బోయపాటి దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‌ఎస్‌.తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో బాలకృష్ణ విభిన్నపాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్‌ భారీ అంచనాలే పెట్టుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని