‘బెల్‌ బాటమ్‌’ టీజర్‌ చూశారా? - Bell Bottom film official teaser released
close
Updated : 05/10/2020 19:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బెల్‌ బాటమ్‌’ టీజర్‌ చూశారా?

ముంబయి: బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ వరుస చిత్రాలతో జోరుమీదున్నారు. త్వరలో ప్రేక్షకుల్ని 80ల కాలంలోకి తీసుకెళ్లబోతున్నారు. ఆయన రా ఏజెంట్‌గా నటించిన సినిమా ‘బెల్‌ బాటమ్‌’. మిస్టరీలను పరిష్కరించి దేశాన్ని కాపాడే ఉన్నతాధికారిగా వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో అక్షయ్‌ బెల్‌ బాటమ్‌ ప్యాంటు ధరించి.. విమానాశ్రయంలో స్టైలిష్‌గా నడుస్తూ అభిమానుల్ని ఆకట్టుకున్నారు. డైలాగ్స్‌‌ లేకుండా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ‘80ల కాలం నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్‌ కథ’ అంటూ అక్షయ్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు స్కాట్‌ల్యాండ్‌లో జరిగింది. వాణీ కపూర్‌ కథానాయిక. హుమా ఖురేషీ, లారా దత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఇమ్మీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రంజిత్‌ ఎమ్‌. తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అక్షయ్‌ గత ఏడాది ‘కేసరి’, ‘మిషన్‌ మంగళ్‌’, ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘గుడ్‌ న్యూజ్‌‌‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ నాలుగు సినిమాలు విజయం అందుకోవడం విశేషం. నవంబరు 9న అక్షయ్‌ నటించిన ‘లక్ష్మీ బాంబ్‌’ ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. ఆయన, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన ‘సూర్యవంశీ’ విడుదల లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇవికాకుండా బాలీవుడ్‌ ఖిలాడీ ‘పృథ్వీరాజ్‌’, ‘అత్రంగి రే’ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని