బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత - Bengali Cinemas Living Legend Soumitra Chatterjee Passes Away
close
Published : 16/11/2020 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత

కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అక్టోబర్‌ 5న కరోనా వైరస్‌ బారిన పడిన ఆయన కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్‌ 14న ఆయనకు కరోనా నెగెటివ్‌ వచ్చింది. అయితే ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందారు. భారత చలన చిత్రసీమలోనే అగ్రనటుడిగా గుర్తింపు పొందిన ఛటర్జీ బెంగాలీ చిత్రసీమకే వన్నె తెచ్చారు. సత్యజిత్‌రేతో ఆయన 14 సినిమాల్లో పనిచేశారు.

1935లో కోల్‌కతాలో జన్మించిన సౌమిత్ర ఛటర్జీ.. 1959లో అపూర్‌ సంకర్‌ సినిమాతో బెంగాలీ చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆ చిత్రానికి సత్యజిత్‌రే దర్శకత్వం వహించారు. ప్రసిద్ధ ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ప్రదోష్‌చంద్ర మిట్టర్‌ జీవిత కథ ఆధారంగా రూపొందించిన సోనార్‌ కెల్లా (1974), జోయ్‌ బాబా ఫెలునాథ్‌ (1979) చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నటుడిగా, రచయితగా 61 ఏళ్ల పాటు ఆయన చిత్రసీమలో కొనసాగారు. భారత చిత్రసీమకు చేసిన సేవలకు గాను ఆయనకు 2004లో పద్మభూషణ్‌‌ అవార్డు లభించింది. 2012లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఛటర్జీ మృతికి పశ్చిమ బెంగాల్‌ మమతా బెనర్జీతోపాటు అనేకమంది నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని