భవానీ ద్వీపానికి వెలుగొచ్చింది!  - Bhavani Dweepam Reopened to Tourists
close
Published : 08/12/2020 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భవానీ ద్వీపానికి వెలుగొచ్చింది! 


 


ఇంటర్నెట్‌ డెస్క్‌ : కరోనా కారణంగా విజయవాడ భవానీ ద్వీపానికి నిలిచిపోయిన సందర్శనలు పునఃప్రారంభం అయ్యాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గటం వల్ల బోట్లు తిప్పేందుకు అధికారులు అనుమతించారు. లాక్‌డౌన్‌ వల్ల మార్చి 25 నుంచి ఇక్కడికి సందర్శన నిలిపివేశారు. దశల వారీగా ఆంక్షల సడలింపుతో సెప్టెంబరు 5 నుంచి సందర్శకులను అనుమతించినా కృష్ణానదికి వరద పోటెత్తటంతో పడవల రాకపోకలను ఆపేశారు. ఈ వరదల్లో రూ.కోట్ల విలువైన పరికరాలూ కొట్టుకుపోయాయి. ప్రస్తుతం మళ్లీ బోట్లకు అనుమతి ఇవ్వటంతో ఈ ప్రాంతమంతా సందడి నెలకొంది.


ప్రస్తుతం పున్నమి ఘాట్‌ నుంచి భవానీ ద్వీపం చేరుకోవటానికి 17 పడవలు అందుబాటులో ఉన్నాయి. భవానీ ద్వీపంలో పార్కులు, కాటేజీలు, సమావేశాలకు అనుగుణంగా ఉండే హాళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర మౌలిక వసతులూ కల్పించారు. కృష్ణానదిలో పడవలు రాకపోకలు సాగించే వేళ తీసుకోవలసిన భద్రతా చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి భవానీ ద్వీపానికి వస్తున్న సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోటింగ్‌ ఉల్లాసంగా ఉందంటున్నారు. నదీజలాల సవ్వళ్లు, సహజ సిద్ధమైన అందాలు, ఆహ్లాదకరమైన పడవ ప్రయాణం వంటివి ఒకేచోట ఉంటే  సందర్శకుల ఆనందానికి కొదవేముంటుంది మరి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని