ద్వీపానికి వెలుగొచ్చేనా? - Bhavani Island at Vijayawada reopen Soon
close
Published : 10/11/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ద్వీపానికి వెలుగొచ్చేనా?


ఇంటర్నెట్‌ డెస్క్‌: నదీ జలాల సవ్వళ్లు, సహజ సిద్ధమైన అందాలు, ఆహ్లాదకరమైన పడవ ప్రయాణం అన్నీ ఒకచోట ఉంటే సందర్శకుల ఆనందానికి కొదవేముంటుంది. అలాంటి ఆనందాన్ని అందిస్తూ పర్యాటకుల మనసు పులకించిపోయేలా చేసే ప్రదేశాలు చాలా అరుదు. అలాంటి అరుదైన ప్రాంతాల్లో భవానీ ద్వీపం ఒకటి. కానీ..ఎనిమిది నెలలుగా సందర్శకులు లేక వెలవెలబోతోంది. కరోనా, వరదలు వంటి వాటితో పూర్తిగా మూతపడింది. అయితే దీనిని పున: ప్రారంభించటానికి ప్రభుత్వం సిద్ధమైంది. కార్తీక మాస వన భోజన వేడుకలతో అతి త్వరలోనే ఇక్కడ పర్యాటకుల సందడి మొదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ ద్వీపం ఇంతకు ముందున్న వైభవాన్ని సంతరించుకుంటుందా?

వేరు వేరు ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులు కచ్చితంగా ఈ భవానీ ద్వీపానికి వెళ్లాలనుకుంటారు. అలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశం వరదలతో కళావిహీనమైంది. ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసివేయక పోవటంతో ద్వీపానికి వెళ్లడానికి పర్యాటకులకు అనుమతి లేదు. తక్కువ పరిమాణంలోనే అయినా.. బ్యారేజీకి స్థిరంగా నీరువస్తోంది. అందువల్లనే గేట్లు ఇంకా పూర్తిగా మూయలేదు. అయితే నవంబరు 10 వరకు ఇక్కడ పడవల ప్రయాణాన్ని పునరుద్ధరించి, సందర్శకులకు అనుమతి ఇవ్వాలని పర్యాటక శాఖ భావిస్తోంది. కానీ నీటిపారుదల శాఖ అధికారులు పచ్చజెండా ఊపే వరకూ బోట్లు తిరిగే ఆస్కారం లేదు. మరోవైపు వరదల వల్ల దెబ్బతిన్న భవానీ ద్వీపంలోని పరికరాలకు మరమ్మతులు చేయాల్సిఉంది.

త్వరలో వాటర్‌ ఏరోడ్రోమ్‌ ఏర్పాటు....
సాధారణంగా...భవానీ ద్వీపానికి సగటున రోజుకు వెయ్యిమంది వస్తారు. వారాంతంలో ఈ సంఖ్య రెండు నుంచి మూడువేల మధ్య ఉంటుంది. ఈ ద్వీపానికి చేరుకోవాలంటే కచ్చితంగా పడవ ఎక్కాల్సిందే. ఇక్కడ దాదాపు రూ. ముప్ఫైకోట్లతో గత ప్రభుత్వం మ్యూజికల్‌ ఫౌంటేన్‌, రోబోటిక్‌ పార్క్‌, కాటేజీలను ఏర్పాటుచేసింది. ఇటీవలి వరదలకు ఇవి మరమ్మతులకు గురయ్యాయి. ‘‘కరోనా వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ప్రవాహం వస్తున్నందున గేట్లు మూసివేసిన తర్వాత అనుమతులు ఇస్తామన్నారు. దీపావళి తరువాత కార్తీక వనభోజనాలు వంటి కార్యక్రమాలు ఉంటాయి. అందువల్ల భవానీ ద్వీపాన్నీ అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నాం’’ అని పర్యాటక శాఖ అంటోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద త్వరలో వాటర్‌ ఎరో డ్రోమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో భవానీ ద్వీపానికి సందర్శకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.

  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని