యూట్యూబ్‌లో రామ్‌చరణ్‌ హవా - Bheem For Ramaraju Most Viewed Teaser Of TFI
close
Published : 31/10/2020 15:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూట్యూబ్‌లో రామ్‌చరణ్‌ హవా

కొత్త రికార్డు సొంతం చేసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

హైదరాబాద్‌: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ యూట్యూబ్‌లో తన హవా కొనసాగిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే సరికొత్త ఘనత సాధించింది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పటివరకూ అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ రికార్డు సొంతం చేసుకుందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. రామ్‌చరణ్‌ పుట్టినరోజు కానుకగా మార్చి 27న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ఆయన పాత్రను పరిచయం చేస్తూ.. ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ అనే పేరుతో ఓ స్పెషల్‌ టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో అల్లూరి సీతారామరాజుగా స్ర్కీన్‌పై చెర్రీని చూసిన అభిమానులు ఫిదా అయ్యారు. టీజర్‌ అదిరిందంటూ సినీ ప్రముఖులతోపాటు ప్రేక్షకులు కామెంట్లు చేశారు. కాగా, విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఈ టీజర్‌ను 33.3 మిలియన్ల మంది అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో వీక్షించారు. దీంతో అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ ఘనత దక్కించుకుంది.

రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌ రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమా కోసం మొదటిసారి రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి పనిచేస్తున్నారు. ఇందులో చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. అలాగే చెర్రీ సరసన బాలీవుడ్‌ నటి ఆలియా, తారక్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. మరోవైపు ఇటీవల విడుదల చేసిన ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ సైతం ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని