
తాజా వార్తలు
బిగ్‌బాస్ నాగ్ మరోసారి వస్తున్నాడు..
లాక్డౌన్ వల్ల మారిన షో ప్రసారాలు
హైదరాబాద్: బిగ్‌బాస్ నాగార్జున మరోసారి బుల్లితెరపై సందడి చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ కారణంగా టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సీరియళ్ల షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. దీంతో ఆయా ఛానళ్లు.. ఆదరణ పొందిన పలు పాత కార్యక్రమాలను పునః ప్రసారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3’ కనువిందు చేసేందుకు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ రియాల్టీ షో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంటోంది. సోమవారం నుంచి శనివారం వరకూ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇది ప్రసారమవుతోంది.
అంతేకాదు తమిళం, హిందీ భాషల్లోనూ ‘బిగ్‌బాస్’ను మళ్లీ ప్రసారం చేస్తున్నారు. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీజన్ 3 బుల్లితెరపైకి మళ్లీ వచ్చింది. హిందీ సీజన్‌కు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.