అలనాటి నటి బయోపిక్‌లో సాయిపల్లవి? - Biopic on late actor Soundarya in the works
close
Published : 12/10/2020 14:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలనాటి నటి బయోపిక్‌లో సాయిపల్లవి?

కీర్తిసురేశ్‌, అనుష్క కూడా..!

హైదరాబాద్‌: చలన చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా బయోపిక్‌ల హవా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసి హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన నటి సౌందర్య జీవితాన్ని ఆధారంగా చేసుకుని టాలీవుడ్‌లో ఓ బయోపిక్ తెరకెక్కనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ విషయంపై ఆయన ఇప్పటికే సౌందర్య కుటుంబ సభ్యులను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, ఈ బయోపిక్‌లో ఎవరు నటించనున్నారనే విషయంలో ప్రస్తుతం సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొని ఉంది. సౌందర్య పాత్రకు సాయిపల్లవి సరిగ్గా న్యాయం చేయగలరని భావించిన చిత్రబృందం ఇప్పటికే సదరు నటిని సంప్రదించినట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు సౌందర్య బయోపిక్‌ గురించి తమ అభిప్రాయాన్ని ట్విటర్‌ వేదికగా బయటపెట్టారు. ‘సౌందర్య పాత్రకు కీర్తిసురేశ్‌ నప్పుతారు’, ‘సౌందర్య కథకు అనుష్క సెట్‌ అవుతారు’ అని పేర్కొంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా గురించి నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని