వెంకీ మనతో ఉంటే నిరాశే ఉండదు.. - Birthday Wishes To Venkatesh
close
Updated : 13/12/2020 12:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెంకీ మనతో ఉంటే నిరాశే ఉండదు..

వెంకీ బర్త్‌డే.. సెలబ్రిటీల విషెస్‌

హైదరాబాద్‌: ఆరు పదుల వయసులోకి వెంకటేశ్‌ అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టారు చిరంజీవి ఓ ట్వీట్‌ చేశారు. వెంకీ సరదాగా ఉంటూనే ఆధ్యాత్మికత పట్ల కూడా ఆసక్తి కనబరుస్తుంటారని అన్నారు. వెంకీ బర్త్‌డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు‌ తెలిపారు.

ప్రియమైన వెంకీమామకు పుట్టినరోజు శుభాకాంక్షలు!! ఆధ్యాత్మికత, ఎప్పుడూ సరదాగా ఉండే నిన్ను చూసి నేనెప్పుడూ ఆనందిస్తూనే ఉంటాను. ‘నారప్ప’ లుక్‌ ఎంతో బాగుంది. మంచి ప్రభావాన్ని చూపిస్తుందని భావిస్తున్నా. ఈ ఏడాది నీకు అన్నీ విజయాలే చేకూరాలని, ‘నారప్ప’తో మరో విజయం మీ సొంతం కావాలని కోరుకుంటున్నా’ - చిరంజీవి

నా హీరో, నా స్నేహితుడు, వెంకీ. ఈ రోజు నువ్వు పుట్టినరోజు జరుపుకొంటున్న సందర్భంగా బహుమతులకు మించిన ప్రేమాభిమానాలను నీకు పంపిస్తున్నాను. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ - ఖుష్బూ

‘హ్యాపీ బర్త్‌డే వెంకీ మామ. మీరు మంచి మనస్సున్న వ్యక్తి. ఆయురారోగ్యాలు మీ సొంతం కావాలని కోరుకుంటున్నా. త్వరలోనే కలుస్తాను కోబ్రా’  - వరుణ్‌ తేజ్‌

‘వెంకీగారు మనతో ఉంటే చుట్టుపక్కల.. నిరాశ, నీరసం అనే మాటే ఉండదు. ఆయనతో ప్రయాణం చాలా సరదాగా, పాజిటివ్‌గా ఉంటుంది. హ్యాపీ బర్త్‌డే వెంకీ గారు. మరోసారి రాక్‌ చేద్దాం’ - అనిల్‌ రావిపూడి

‘వినయం విధేయతలతోపాటు ఎప్పుడూ సరదాగా ఉండే వెంకటేశ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా మీకు మంచే జరగాలని ఆశీస్తున్నా’ - హరీశ్‌ శంకర్‌

‘నేను కలిసిన అద్భుతమైన వ్యక్తుల్లో ఒకరైన వెంకటేశ్‌కి జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు మీ సొంతం కావాలని కోరుకుంటున్నా’ - రామ్‌ పోతినేని

హ్యాపీ బర్త్‌డే వెంకీ సర్‌. ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించే ఓ అసాధారణమైన వ్యక్తి మీరు. మీరు ఎప్పుడూ సంతోషం, ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. లవ్‌ యూ సర్‌’ - బాబీ

‘మోస్ట్‌ పాజిటివ్‌ పర్సన్‌ వెంకీకి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకన్నీ విజయాలే చేకూరాలని ఆశిస్తున్నా’ - గోపీచంద్‌ మలినేని

‘హ్యాపీ బర్త్‌డే వెంకీ. టాలీవుడ్‌లో నా అభిమాన నటుల్లో మీరు కూడా ఒకరు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నా’ - హేమంత్‌ మధూకర్‌

ఇవీ చదవండి
వెంకటేశ్‌ను మార్చేసిన ‘ప్రేమించుకుందాం రా!’

‘నారప్ప’ టీజర్‌.. వచ్చిందప్ప..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని