కెమెరాకు చిక్కిన వింత పాము - Bizarre Snake Found In US experts asks what kind of spacies is this
close
Published : 04/11/2020 23:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కెమెరాకు చిక్కిన వింత పాము

వర్జీనియా: అమెరికాలోని మిడ్లోతియాన్‌ ప్రాంతంలో ఓ వింత పాము కెమెరాకు చిక్కింది. దాని ఆకారం నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అర్ధ చంద్రాకారంలో తల ఉన్న ఇలాంటి పామును తామెప్పుడు చూడలేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ సరీసృపానికి సంబంధించిన ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పంచుకొని దాని వివరాలు తెలిస్తే చెప్పాలని నెటిజన్లను కోరారు. ‘ఇంతకుముందెన్నడూ ఇలాంటి పామును చూడలేదు. దాని ఆకారం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని గురించి మీకేమైనా తెలిస్తే చెప్పండి’ అంటూ వర్జీనియాలోని వైల్డ్‌లైఫ్‌ అధికారులు పేర్కొన్నారు.

అనంతరం ఆ ప్రాణికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. దానిని హామెర్‌ హెడ్‌ పురుగుగా గుర్తించారు. ఆగ్నేయ ఆసియాలో ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. వారు పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్టుపై వందలమంది నెటిజన్లు కామెంట్లు చేశారు. అది హామెర్‌హెడ్‌ అని, వానపాముల్ని తిని జీవిస్తుందని తెలిపారు. వాటిని చంపడం కష్టమని, అత్యధిక పునరుత్పత్తి శక్తి కలిగి ఎంత తీవ్రంగా గాయపడినా తిరిగి కోలుకుంటాయని వెల్లడించారు.
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని