ఎమ్మెల్సీ కవితపై భాజపా ఫిర్యాదు - Bjp Complaint On MLC Kavitha
close
Published : 03/12/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎమ్మెల్సీ కవితపై భాజపా ఫిర్యాదు

అనర్హత వేటు వేయాలని ఈసీకి లేఖ

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా లేఖ రాసింది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన కవిత.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఓటు వేశారని లేఖలో వెల్లడించింది. గతంలో కవిత నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేసినప్పుడు బోధన్‌ అసెంబ్లీలోని నియోజకవర్గంలో తనకు ఓటు ఉన్నట్లు అఫడవిట్‌లో పేర్కొందని తెలిపింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్‌ చిరునామాతో మరోసారి ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించింది. ‘‘నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను. మీరు బయటకు వచ్చి ఓటేయండి’’ అని కవిత ట్వీట్‌ చేసినట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి లేఖలో
ప్రస్తావించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని