‘రంభ, ఊర్వశి, మేనక బ్రాండ్‌ నాది..’ - Black Rose film song Naa Tappu Emunnadabbaa Video released
close
Updated : 30/09/2020 20:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రంభ, ఊర్వశి, మేనక బ్రాండ్‌ నాది..’

టాలీవుడ్‌లోకి బాలీవుడ్‌ భామ ఎంట్రీ
ఆకట్టుకుంటోన్న మొదటి పాట

హైదరాబాద్‌: ‘హలో.. సౌత్‌ ఇండియా.. నేను ఊర్వశి.. రంభ, ఊర్వశి, మేనక బ్రాండ్‌కు చెందిన అమ్మాయిని..’ అంటూ సందడి చేస్తున్నారు బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఆమె త్వరలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఈ భామ తొలిసారి దక్షిణాదిలో నటిస్తున్న సినిమా ‘బ్లాక్‌ రోజ్‌’. దర్శకుడు సంపత్‌ నంది అందించిన కథతో.. మోహన్‌ భరద్వాజ్‌ తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బుధవారం ఈ చిత్రంలోని ‘నా తప్పు ఏమున్నదబ్బా..’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఇందులో ఊర్వశి తన అందాన్ని, దాని వల్ల వచ్చిన కష్టాల్ని చెబుతూ.. చిందేశారు. మణిశర్మ ఈ పాటకు బాణీలు అందించారు. హారికా నారాయణ్‌ ఆలపించారు. సంపత్‌ నంది పాట సాహిత్యం రాశారు. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది.

ప్రముఖ రచయిత షేక్‌స్పియర్‌ రాసిన ‘‘ది మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌’లోని షైలాక్‌ పాత్ర ఆధారంగా సంపత్‌ ఈ కథను సిద్ధం చేశారట. రూ.3 వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న ఓ ఫైనాన్స్‌ కంపెనీలో  పని చేస్తున్న ఓ మోడ్రన్‌ మహిళ వసుధ జీవితంలో ఓ రోజు ఏం జరిగిందనేదే ఈ చిత్ర కథ.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని