ఆ ‘ఆశ్రమం’లో ఏం జరిగింది? - Bobby Deol Aashram Official Trailer
close
Published : 18/08/2020 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ‘ఆశ్రమం’లో ఏం జరిగింది?

ఇంటర్నెట్‌డెస్క్‌: గత కొంతకాలంగా వెబ్‌ సిరీస్‌లకు విశేష ఆదరణ లభిస్తోంది. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా వాటిని వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో కొత్త కథలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న వాటికి నిర్మాణానంతర కార్యక్రమాలుపూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాబీ దేఓల్‌ కీలక పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఆశ్రమ్‌’. ప్రకాష్‌ ఝా దర్శకుడు.

తాజాగా ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. అన్ని రంగాలను శాసించే బాబా నిరాలా ఆఫ్‌ కాశీపూర్‌ పాత్రలో బాబీ దేఓల్‌ కనిపించారు. తొలిసారి ఆయన వెబ్‌సిరీస్‌లో నటిస్తుండటం విశేషం. దేవుడి ప్రతినిధిగా నిరాలా బాబాను భక్తులు ఏవిధంగా కొలిచేవారు. ఆయనను ఏవిధంగా అనుసరించేవారు. ఆ ఆశ్రమంలో జరిగిన అత్యాచారం, హత్యల వెనుక ఉన్నది ఎవరు? చివరకు బాబా ఏమయ్యారు? తదితర విషయాలు తెలియాలంటే ‘ఆశ్రమ్‌’ చూడాల్సిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ ఆగస్టు 28 నుంచి ఎంఎక్స్‌ ప్లేయర్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని