close

తాజా వార్తలు

తొలిసారి మాధురీ దీక్షిత్‌...

ముంబయి: ఒకప్పుడు స్టార్‌ కథానాయికయిగా వెండితెరపై ప్రేక్షకులను అలరించిన అందాల సుందరి మాధురీ దీక్షిత్‌. కొంత విరామం తర్వాత ఈ ఏడాది ‘టోటల్‌ ఢమాల్‌’, ‘కళంక్‌’ చిత్రాలతో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. అడపాదడపా చిత్రాలు చేస్తున్న మాధురీ ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించే వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ అభిమానులతో పంచుకుంది.

‘ఈ వార్త వింటే మీరు దిల్‌ తో పాగల్‌ హై అనాల్సిందే. త్వరలో తెరకెక్కనున్న నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్‌ సిరీస్‌లో మాధురీ దీక్షిత్‌, కరణ్‌జోహార్‌ నటించనున్నారు. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం’

-నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా

ఈ విషయాన్ని ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్‌జోహార్‌ కూడా ధ్రువీకరించారు. ‘మాకు క్వీన్‌ దొరికింది. రాబోయే నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్‌ మరింత అందంగా హృద్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె తన సౌందర్యంతో డిజిటల్‌ స్పేస్‌లో మేజిక్‌ చేయనుంది’ అని పేర్కొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.