ఎట్టకేలకు గాయనికి కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌
close
Published : 05/04/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎట్టకేలకు గాయనికి కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌

లఖ్‌నవూ: బాలీవుడ్‌ గాయనికి ఐదోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. అయితే మరో పరీక్ష నిర్వహించే వరకు ఆమె ఆసుపత్రిలోనే ఉండాలని లఖ్‌నవూలోని పీజీఐ వైద్యులు సూచించారు. తదుపరి వైద్య పరీక్షలో కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత డిశ్చార్జ్‌ చేస్తామని పేర్కొన్నారు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల్లో ఆందోళన తగ్గింది.

గాయని మార్చి 9న లండన్‌ నుంచి భారత్‌కు వచ్చారు. ఆపై లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. కొన్ని రోజులకు ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. మార్చి 20న ఆసుపత్రికి తరలించారు. అయితే విదేశాల నుంచి వచ్చిన తర్వాత స్వీయ నిర్బంధంలో ఉండకుండా ఇంత నిర్లక్షంగా వ్యవహరించడం పట్ల అనేక విమర్శలు ఎదురయ్యాయి. ఆమె విమానాశ్రయంలో పరీక్షలు చేయించుకోకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. అయితే దీనిపై గాయని స్పందిస్తూ.. ‘విమానాశ్రయంలో స్ర్కీనింగ్‌ను తప్పించుకోవడానికి నేను బాత్‌రూమ్‌లో దాక్కున్నానని వస్తున్న వార్తలన్నీ వదంతులే. ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ వద్ద ఏవిధంగా స్ర్కీనింగ్‌ను తప్పించుకోగలమో చెప్పండి? ముంబయి విమానాశ్రయంలో నిర్వహించిన స్ర్కీనింగ్‌ పరీక్షలో నేను పాల్గొన్నాను. ఒకరోజంతా ముంబయిలోనే ఉన్నా. కానీ ఆపై కొన్ని రోజుల తర్వాత నాలో కరోనా లక్షణాలు కనిపించాయి’ అని అన్నారు. 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని