నిహారికని చూస్తే కన్నీళ్లు వచ్చేశాయ్‌..! - Both my husband and I had tears in our eyes throughout Says Nagababu Wife Padmaja
close
Updated : 13/12/2020 14:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిహారికని చూస్తే కన్నీళ్లు వచ్చేశాయ్‌..!

మూడు రోజులు జ్వరం.. అన్నీ వాళ్లే చూసుకున్నారు

నాగబాబు సతీమణి పద్మజ

హైదరాబాద్‌: తన కుమార్తె నిహారిక, అల్లుడు చైతన్యల అభిరుచులు, ఆలోచనా విధానం దాదాపు ఒకేలా ఉన్నాయని నటుడు నాగబాబు సతీమణి పద్మజ తెలిపారు. ఇటీవల కుటుంబసభ్యుల సమక్షంలో నిహారిక-చైతన్యల వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌లో మూడురోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో మెగా-అల్లు కుటుంబాలు సందడి చేశాయి. ఈ నేపథ్యంలో పద్మజ పెళ్లి వేడుకల గురించి వివరించారు.

‘నా చిన్నారి కుమార్తె నిహారిక ఇప్పుడు వివాహిత అయ్యిందంటే నమ్మలేకపోతున్నాను. అందరు తల్లిదండ్రులు మాదిరిగానే మేము కూడా మా కుమార్తెకు ఘనంగా వివాహం చేయాలని భావించాం. మేము అనుకున్నట్లే జరిగినందుకు ఎంతో ఆనందిస్తున్నా. పెళ్లికి మూడు రోజుల ముందు నుంచి నాకు బాగా జ్వరం.. నా భర్త, కుమారుడు వరుణ్‌తేజ్‌.. పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ముఖ్యంగా నిహారిక మునుపెన్నడూ లేనంత సంతోషంగా ఉంది.’

‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారని అంటారు. నిహారిక-చైతన్యల జంటను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. వారిద్దరూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌. చూడముచ్చటైన జంట. వాళ్ల ఆలోచనా విధానం.. అభిరుచులు ఒకేలా ఉంటాయి. నా కుమార్తె.. ఆదర్శవంతమైన జీవితభాగస్వామిని సొంతం చేసుకున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నా’

‘పెళ్లి కుమార్తెను చేసిన సమయంలో నిహారిక నా నిశ్చితార్థపు చీరలో మెరిసిపోయింది. ఆ రోజు నిహారికను చూసినప్పుడు నా భర్త, నేనూ కన్నీళ్లు పెట్టుకున్నాం. అవి మాకు భావోద్వేగభరితమైన క్షణాలు. అలాగే అవే నా జీవితంలో ఓ అపురూప క్షణాలు’ అని పద్మజ వివరించారు.

ఇవీ చదవండి

నిశ్చయ్‌.. ఇవి చాలా ఖరీదు గురూ..!

నిహారిక-చైతన్య: కొత్త జంటలు కొత్తఫొటోలుAdvertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని