‘బుచ్చినాయుడు కండ్రిగ’లో ఏం జరిగింది? - Bucchinaidu Kandriga Teaser
close
Published : 15/08/2020 19:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బుచ్చినాయుడు కండ్రిగ’లో ఏం జరిగింది?

హైదరాబాద్‌: ఓటీటీ వేదికగా విడుదలవుతున్న చిత్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిడివితో సంబంధం లేకుండా అనేక చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. కంటెంట్‌ బాగుంటే చాలు ఆన్‌లైన్‌ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ద్రిషిక చందర్‌, మున్నా, రవి వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి’. శనివారం ఈ చిత్ర టీజర్‌ను కథానాయిక రకుల్‌ ప్రీత్ సింగ్‌ విడుదల చేశారు.

‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ మీ కోసం వస్తోంది. ‘బుచ్చినాయుడు కండ్రిగ’ టీజర్‌ను విడుదల చేయడం చాలా ఆసక్తిగా అనిపించింది’’ -ట్విటర్‌లో రకుల్‌

‘నా అరుపు వెనుక నా కోపం కనపడుతోంది. కానీ, నాకు నా గతం కనపడుతోంది. నా పేరు బాలు. మా ఊరు బుచ్చినాయుడు కండ్రిగ తూర్పువీధి’ అంటూ ప్రారంభమైన టీజర్‌ ఆకట్టుకుంటోంది. ఆగస్టు 21న ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని