BujjiIlaRaa: ధన్‌రాజ్‌లో మరో కోణం చూశా - Bujji IlaRaa Teaser
close
Updated : 19/10/2021 06:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BujjiIlaRaa: ధన్‌రాజ్‌లో మరో కోణం చూశా

సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుజ్జీ... ఇలా రా’. చాందిని అయ్యంగార్‌ కథానాయిక. ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మాతలు. రూపా జగదీశ్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ సోమవారం హైదరాబాద్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ధన్‌రాజ్‌ నేను కలిసి చాలా సినిమాలు చేశాం. కమెడియన్‌గా కంటే కూడా, ఆయనలోని  మరో కోణాన్ని చూశా. అందుకే అతనికి ఓ కథని పంపించా. అదే ‘బుజ్జీ.. ఇలారా’ రూపంలో తెరకెక్కింది’’ అన్నారు. ధన్‌రాజ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో కొత్త ధన్‌రాజ్‌ని చూస్తార’’న్నారు. కార్యక్రమంలో కోన వెంకట్‌, బి.వి.ఎస్‌.రవి తదితరులు పాల్గొన్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని