బుమ్రా.. బౌలింగ్‌ చూడటం అదృష్టం - Bumrah is worlds best T20 bowler says MI bowling coach Bond
close
Published : 06/11/2020 22:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుమ్రా.. బౌలింగ్‌ చూడటం అదృష్టం

అబుదాబి: టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలరని ముంబయి బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్‌ ప్రశంసించాడు. ఇండియన్‌ టీ20 లీగులో అతడి బౌలింగ్‌ను ఆస్వాదించడం అదృష్టమని పేర్కొన్నాడు. ట్రెంట్‌బౌల్ట్‌ అత్యంత ప్రమాదకర బౌలరని తెలిపాడు. అతడు మాట్లాడిన వీడియోను ముంబయి ట్విటర్లో పోస్ట్‌ చేసింది.

దిల్లీతో జరిగిన క్వాలిఫయర్‌-1 పోరులో బుమ్రా చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే. కేవలం 14 పరుగులిచ్చి కీలకమైన 4 వికెట్లు తీశాడు. అతడికి బౌల్ట్‌ (2/9) అండగా నిలిచాడు. ఈ మ్యాచులో ముంబయి 57 పరుగుల భారీ తేడాతో గెలిచి ఫైనల్‌ చేరుకున్న సంగతి తెలిసిందే.

‘జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ను చూడటం అదృష్టం. అతడు ప్రపంచంలోనే నంబర్‌వన్‌ టీ20 బౌలర్‌. తనకు అప్పగించిన పనిని మెరుగ్గా పూర్తి చేస్తాడు. 2012 నుంచి బౌల్ట్‌తో కలిసి పనిచేస్తున్నాను. అతడెంత అత్యుత్తమంగా బౌలింగ్‌ చేస్తాడో నాకు తెలుసు. అతడు జట్టులో ఉండటం నిజంగా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ టోర్నీలో ఎంత బాగా బౌలింగ్‌ చేశాడో మనందరం చూశాం’ అని బాండ్‌ అన్నాడు.

‘బుమ్రా, బౌల్ట్‌ ఉండటంతో ముంబయి పని సులువుగా అవుతోంది. వారిద్దరూ త్వరగా వికెట్లు తీస్తున్నారు. బుమ్రా అందుకే టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్నాడు’ అని బాండ్‌ తెలిపాడు. ఇక తమ జట్టు బ్యాటింగ్‌ అత్యంత బలమైందని పేర్కొన్నాడు. ‘మాది ప్రమాదకరమైన బ్యాటింగ్‌ లైనప్‌. దీనిని దెబ్బకొట్టడం చాలా కష్టం. క్వాలిఫయర్‌-1 మధ్య ఓవర్లలో దిల్లీ దాదాపు మమ్మల్ని కట్టడి చేసింది. వారికి మరికాస్త అదృష్టం కలిసొస్తే మేం మరింత ఒత్తిడిని ఎదుర్కొనేవాళ్లం’ అని తెలిపాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని