నైపుణ్యాభివృద్ధికి చర్యలు వేగవంతం చేయండి - CM Jagan Review On Skill Development
close
Updated : 01/09/2020 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నైపుణ్యాభివృద్ధికి చర్యలు వేగవంతం చేయండి

అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి: రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఆ కళాశాలల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోర్సులు, శిక్షణ అందివ్వాలని నిర్దేశించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కళాశాలల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు సుశిక్షితులై ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా శిక్షణ ఇవ్వాలని.. ఆ దిశగా నిరంతర పర్యవేక్షణ సహా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. 

కళాశాలల కోసం ఇప్పటివరకూ దాదాపు 20చోట్ల స్థలాలను గుర్తించామని.. మిగిలిన చోట్ల కూడా స్థలాల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. భవనాల నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉండాలని.. ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులకు జగన్‌ సూచించారు. ఆయా కళాశాలల్లో ప్రవేశపెట్టనున్న కోర్సులు, పాఠ్యప్రణాళిక తయారీపై సీఎం ఆరా తీశారు. పరిశ్రమల అవసరాలపై సర్వే చేశామని.. దాని ఆధారంగా కోర్సులు నిర్ణయించామని అధికారులు తెలిపారు. పాఠ్య ప్రణాళిక తయారీలో 4 అంతర్జాతీయ సంస్థల భాగస్వా్మ్యం తీసుకున్నామని వివరించారు. ఆర్థికశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని కళాశాలల భవన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. హైఎండ్‌ స్కిల్స్‌తోపాటు ప్రతి కళాశాలలో ఏసీలు, ప్లంబింగ్‌, భవన నిర్మాణం తదితర ఉపాధి అవకాశాలపైనా యువతకు శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని