పర్యాటకానికి చిరునామాగా ఏపీ: జగన్‌ - CM Jagan Review on AP Tourism
close
Published : 20/08/2020 16:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పర్యాటకానికి చిరునామాగా ఏపీ: జగన్‌

పెట్టుబడులకు అనువుగా నూతన పర్యాటక పాలసీ
పర్యాటక శాఖపై సీఎం సమీక్ష

అమరావతి: పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి అనువుగా ఉండేలా నూతన పర్యాటక పాలసీ రూపొందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా మారాలని ఆకాంక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి అవంతితో కలిసి పర్యాటకశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజస్థాన్‌కు దీటుగా ఇక్కడి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఏపీ టూరిజం నూతన పాలసీ రూపకల్పనపై చర్చించడంతో పాటు అందులో మార్పులు చేర్పులపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఆతిథ్య రంగంలో సుప్రసిద్ధ సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. 

రాష్ట్రంలో 12 నుంచి 14 ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని.. అరకులో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని జగన్‌ ఆదేశించారు. ఇప్పటికే సగంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో మంచి కళాశాల పెట్టాలని.. ఆ కళాశాల నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉండాలన్నారు. అనంతరం ఏపీ టూరిజం ఆన్‌లైన్‌ ట్రేడ్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని