రావికొండల మృతి కేసీఆర్‌, చిరంజీవి సంతాపం - CM kcr condolence on raavi kondala demise
close
Updated : 28/07/2020 22:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రావికొండల మృతి కేసీఆర్‌, చిరంజీవి సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు రావి కొండలరావు మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. రావు కొండలరావు గొప్ప నటుడని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రావి కొండల మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చిరంజీవి అన్నారు. తాను హీరోగా పరిచయం అయిన నాటి నుంచి ఆయనతో పలు చిత్రాల్లో నటించానని గుర్తు చేసుకున్నారు. రావి కొండల మరణంతో చిత్ర పరిశ్రమ ఓ బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయిందని విచారం వ్యక్తంచేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రావికొండల మృతి వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యాయని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన సేవలు అజరామరం అన్నారు. నాటక రచయితగా, నటుడిగా రంగస్థలానికి.. పాత్రికేయుడిగా సినీ జర్నలిజానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని