అల్లు స్టూడియోస్‌.. మీ ఆశీర్వాదం కావాలి:బన్ని - COMMENCEMENT OF ALLU STUDIOS
close
Updated : 01/10/2020 16:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల్లు స్టూడియోస్‌.. మీ ఆశీర్వాదం కావాలి:బన్ని

హైదరాబాద్‌: సునిశిత హాస్యం, తన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హాస్యనటుడు అల్లు రామలింగయ్య. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లతోనే కాదు, ఆ తర్వాతి తరం యువ హీరోలతోనూ ఆయన నటించారు. గురువారం అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా చిత్ర పరిశ్రమ ఆయన నటనను స్మరించుకుంటోంది. ఈ సందర్భంగా కథానాయకుడు అల్లు అర్జున్‌ ఓ ఆసక్తికర వార్తను వెల్లడించారు. త్వరలోనే ‘అల్లు స్టూడియోస్‌’ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్టూడియోస్‌కు సంబంధించిన పనులను మొదలు పెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌ గండిపేట సమీపంలో 10 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో దీన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.

‘మా తాతయ్య నట వారసత్వానికి గుర్తుగా ఆయన పేరుతో అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించబోతున్నాం. దీన్ని ఆయనకు అంకితమిస్తాం. ఇందుకు సంబంధించిన పనులు మొదలు పెట్టాం. మాకు ఆశీస్సులు, శుభాకాంక్షలు కావాలి’’ అని అల్లు అర్జున్‌ అభిమానులను కోరారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్యకు నివాళి అర్పిస్తూ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని