కరోనా కేసుల్లో రెండో స్థానానికి భారత్‌ - CORONA UPDATES IN INDIAN STATES
close
Published : 06/09/2020 21:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కేసుల్లో రెండో స్థానానికి భారత్‌

దిల్లీ: దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఉదయం కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 41,13,811 కాగా.. మరణాల సంఖ్య 70,626గా ఉంది. తాజాగా ఆయా రాష్ట్రాలు వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో కేసుల సంఖ్య 41.30 లక్షలు దాటింది. దీంతో అత్యధిక కేసులున్న బ్రెజిల్‌ను దాటేసి భారత్‌ రెండో స్థానానికి చేరింది. తొలి స్థానంలో అమెరికా (64,34,626), మూడో స్థానంలో బ్రెజిల్‌ (41,23,000), నాలుగో స్థానంలో రష్యా (10,25,505) ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 2.69 కోట్ల కేసులు, 8.80లక్షలకుపైగా మరణాలు నమోదయ్యాయి.

మరోవైపు కర్ణాటకలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 9,319 పాజిటివ్‌ కేసులు.. 95 మరణాలు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,98,551కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 99,266 మంది చికిత్స పొందుతున్నారు. 2,92,873 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ఇప్పటి వరకు 6,393 మంది మృతి చెందారు. తమిళనాడులో గడిచిన 24 గంటల్లో మరో 5,783 కొత్త కేసులు.. 88 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కేసుల సంఖ్య 4,04,186కి చేరింది. కరోనాతో 7,836 మంది మృతి చెందారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని