ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్‌ సాధ్యమే.. - Can Deliver corona Vaccine In 2020 claims Pfizer
close
Updated : 28/10/2020 13:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్‌ సాధ్యమే..

ధీమా వ్యక్తం చేసిన ఫైజర్‌ ఫార్మా

న్యూయార్క్‌: ఈ ఏడాది చివరి కల్లా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ సాధ్యమేనని అమెరికన్‌ ఫార్మా దిగ్గజం ఫైజర్‌ తాజా ప్రకటనలో వెల్లడించింది. క్లినికల్‌ పరీక్షలు అనుకున్న విధంగా జరిగి.. అధికారిక అనుమతులు సకాలంలో లభిస్తే 2020 ముగిసేలోపే కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ సాధ్యమేనని సంస్థ సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్లా తెలిపారు. తాము వ్యాక్సిన్‌ తయారీలో చివరి అంకంలో ఉన్నామని.. ప్రజారోగ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు అతి ముఖ్యమైన ఈ విషయంలో ఓర్పు వహించటం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరాంతానికల్లా 40 మిలియన్‌ డోసులు.. మార్చి 2021 కల్లా 100 మిలియన్‌ డోసులు అందజేసేందుకు ఫైజర్‌ అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

టీకా సామర్థ్యానికి  సంబంధించిన సమాచారం అక్టోబరు ‌కల్లా సిద్ధం చేయగలమని సంస్థ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టీకా సామర్థ్యాన్ని అంచనా వేయటంలో ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదని సంస్థ సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్లా అంగీకరించారు. కాగా అత్యవసర పరిస్థితిలో తమ వ్యాక్సిన్‌ను వాడేందుకు అనుమతుల కోసం నవంబర్‌ మూడో వారంలో దరఖాస్తు చేయాలని ఫైజర్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ విడుదల విషయంలో తాము దూకుడుగా వ్యవహరించటం లేదని.. తమది ఆశావహ దృక్పథమని సంస్థ సీఈఓ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని